ప్రముఖ మొబైల్ కంపెనీలో మోటో కంపెనీ ఒకటి..భారత మార్కెట్ఫోన్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మోటో కంపెనీ కొత్త మొబైల్ ను లాంఛ్ చేస్తూ వస్తున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఫీచర్లతో మార్కెట్ లో వదులుతున్నారు. ఈ మేరకు మోటోలో కొత్త ఫోన్ ను లాంఛ్ చేశారు. ఆ ఫోన్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ధర తక్కువ లో ఎక్కువ ఫీచర్స్ తో ఈ ఈ ఫోన్ రానుందని సమాచారం..



ఇప్పటికే యూఎస్ ఎఫ్‌సీసీ, థాయ్‌ల్యాండ్ ఎన్బీటీసీ, టీయూవీ సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. అయితే మోటో ఈ7 ప్లస్ గత నెలలోనే లాంచ్ అయినప్పటికీ మోటో ఈ7కు సంబంధించిన వివరాలు మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అయితే ఇప్పుడు ఇండియా మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. అవి ప్రస్తుతం మొబైల్ ప్రియుల షేర్ల తో చర్చనీయాంశంగా మారింది.



ఫోన్ స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే..మోటో ఈ7 ప్లస్ ధరను రూ.9,499గా నిర్ణయించారు. మోటో ఈ7 ధర కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే 6.2 అంగుళాల ఉంటుంది. అయితే ఈ ఫోన్ ప్రాసెసర్ ను మాత్రం లీక్ చేయలేదు.2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు 13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కలిగిన కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు కోసం ముందు వైపు 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉండనుందని తెలుస్తోంది. వైఫై, ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను అందించనున్నారు.ఈ ఫోన్ లో మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి.. మరి ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎప్పుడొస్తుంది అనేది మాత్రం చెప్పలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: