సోనీ ఏ8హెచ్ అల్ట్రా హెచ్‌డీ హెచ్‌డీఆర్ ఓఎల్ఈడీ టీవీని మనదేశంలో లాంచ్ చేసింది. అయితే దీని ధర ఏకంగా రూ.2.8 లక్షలుగా ఉంది. ఇందులో అల్ట్రా హెచ్‌డీ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇది డాల్బీ విజన్ ఫార్మాట్‌లో కూడా హెచ్‌డీఆర్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ ప్రస్తుతానికి సోనీ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్లు, సోనీ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్, అమెజాన్‌ల్లో అందుబాటులో ఉన్నాయి... వీటికి ఉన్న ప్రత్యేకతలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. ధర మాట పక్కన పెడితే.. అన్నీ ఫీచర్లు ఉన్న ఈ టీవీను కొనుగోలు చేయడానికి ఫ్రీ బుకింగ్ అవుతున్నాయి..
ఈ టీవీ 65 అంగుళాల వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. దీని ధరను రూ.2,79,990గా నిర్ణయించారు. ఈ సోనీ టీవీ మనదేశంలో ప్రీమియం విభాగంలో లాంచ్ అయింది.. యాప్ డేటా కోసం 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లేస్టోర్ యాప్స్ కూడా ఉన్నాయి. మిగిలిన టీవీ కంపెనీలలో ఏ కంపెనీకి లేవని తెలుస్తుంది.. భారీ ఫీచర్లతో వచ్చిన ఈ కంపెనీ టీవీ కి ధర కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా జనాలు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి