
Poimo నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5.5 కిలోల బరువు కలదు.. ఇందులో సాఫ్ట్ రోబోటిక్ టెక్నాలజీని కూడా ఉపయోగించడం జరిగింది. దీనివలన ఈ బైక్ సురక్షితంగా, తేలికగా వుంటుంది. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణం చేయగలరు. మొత్తం స్కూటర్ బరువును తగ్గించుకునేందుకు కంపెనీ వారు దీనిని వైర్లెస్ పవర్ సిస్టం ను కూడా అందించారు. దీంతో ఆ స్కూటర్ పై కూర్చున్న వ్యక్తి ఈ బైక్ ను చాలా సులభంగా నడపగలరు.
దీని బాడీని థర్మోప్లాస్టిక్ పాలియురేతే న్ తో తయారు చేయబడింది. ఎయిర్ బెడ్ ను ఉపయోగించే ఆప్షన్ కూడా ఇందులో ఉన్నది. ఇది ముందు వెనుక చక్రాలు, ఎలక్ట్రిక్ బ్యాటరీ, మోటారు, హ్యాండిల్ బార్ వైర్లెస్ కంట్రోల్ ను అందించడం జరుగుతోంది. కంపెనీ సమాచారం ప్రకారం ఈ స్కూటర్ తయారు చేసేందుకు 5 నిమిషాల సమయం పడుతుంది. స్కూటర్ నడపడానికి ఇందులో కేవలం గాలి ని నింపాలి. ఆ తర్వాత బైక్ సిద్ధమవుతోంది దీని వెనుక భాగంలో వాళ్ళు ఉండడం వల్ల దీనిని నుంచి గాలి తీసేయవచ్చు. ఆ తర్వాత ఎంచక్క మీ బ్యాగ్ లో ఈ బైకు ని ఉంచుకోవచ్చు. అయితే ఇది ఇంకా మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. త్వరలో రాబోతున్నట్లు కంపెనీ తెలియజేసింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి