సాధారణంగా అడవికి రారాజు అని సింహాన్ని పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఎంత భారీ జంతువు అయినా సరే సింహాన్ని చూసింది అంటే చాలు ప్రాణ భయంతో వణికి పోతూ ఉంటుంది అని చెప్పాలి. తనకంటే భారీ సైజు ఉన్న జంతువులను సైతం ఎంతో అలవోకగా సింహాలు వేటాడి ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి. అందుకే ఇక అడవిలో ఉన్న అన్ని జంతువులు కూడా అటు సింహానికి భయపడుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ హైనాలు మాత్రం కొన్ని కొన్ని సార్లు ఏకంగా సింహాలనే భయపెట్టడం లాంటివి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. కానీ అటు ఎంతో ప్రమాదకరమైన హైనాలు మాత్రం గుంపుగా ఉంటాయి. ఇలా గుంపుగా ఉన్న హైనాలు ఏకంగా భారీ సింహాన్ని సైతం భయపెడుతూ ఉంటాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక సింహాలకు హైనాలకు మధ్య శత్రుత్వం జాతి వైరంగా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక సింహాలు ఒంటరిగా ఉన్నప్పుడు నాలుగు హైనాలు చుట్టూ ముట్టాయి అంటే చాలు... ప్రాణాలు దక్కించుకోవడం కోసం సింహం సైతం పెద్ద పోరాటమే చేయక తప్పదు. ఇక ఇప్పుడు ఇలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది అని చెప్పాలి. కాస్త బలహీనంగా ఉన్న ఆడ సింహం ఒకటి అనుకోకుండా ఒంటరిగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో అక్కడే ఉన్న నాలుగు హైనాల గుంపు కంట పడింది అని చెప్పాలి. సాధారణంగానే ఈ రెండు జంతువుల మధ్య జాతి వైరం ఉంటుంది. అందులోనూ బలహీనంగా ఉన్న సింహం ఒంటరిగా కూడా ఉంది. ఇంకేముంది హైనలకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఒంటరిగా ఉన్న ఆడ సింహాన్ని నాలుగు హైనాలు పీక్కు తినేందుకు  సిద్ధంగా ఉన్నాం అన్నట్లుగా చూస్తున్నాయి. కానీ సింహం లోపల భయాన్ని దాచుకొని బయటికి ప్రతిఘటిస్తూ చిన్నచిన్నగా అడవిలోకి వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: