కోపం మనుషులకే కాదు జంతువులకు, పక్షులకు కూడా ఉన్న సహజ గుణం.. ఈ కోపం నుండే పగద్వేషం పుడుతాయి.. ఒక రకంగా ఈ కోపం అనేది ప్రతి జీవికి పుట్టుకతో వచ్చే మచ్చ లాంటిది.. ఎంత సాత్విక జీవనం గడుపుతున్న కూడ ఏదో ఒక సందర్భంలో కోపం రాక తప్పదు.. ఇక దీని వల్లే ఎన్ని విధ్వంసాలు జరిగాయో, జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.. కోపంతో కొందరు నేరస్దులుగా మారితే, మరికొందరు ఉగ్రవాదులుగా మారుతున్నారు.. దీనిబట్టి అర్ధం అయ్యేది ఏంటంటే కోపంలో ఉన్న వ్యక్తి ప్రాణం తీసుకోవడానికైనా, ప్రాణం తీయడానికైనా వెనుకాడడు.. మనుషుల్లోనే ఇలా ఉంటే ఇక జంతుప్రపంచంలో అయితే పరిస్దితులు మరీ దారుణంగా ఉంటాయి..

 

 

జంతువులకు గానీ, కౄరమృగాలకు గానీ చిర్రెత్తుకొచ్చిందంటే అది చేసే నాశనం విచ్చల విడిగా ఉంటుంది.. ఇప్పటికే ఎన్నో వీడియోల్లో సాధు జంతువులతో పాటుగా, పెంపుడు జంతువులైన పిల్లి, ఆవు, కుక్క ఇవి రక్తపాతాన్ని సృష్టించాయన్న విషయం తెలిసిందే.. తమ యజమానులతో పాటుగా అడ్డు వచ్చిన వారి ప్రాణాలు కూడా తీసాయి.. ఇక ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కోపంగా ఉన్న రెండు హిప్పోస్ యుద్దానికి దిగాయి.. వాటి పళ్లు విరిగిపోయి రక్తాలు కారుతున్న వాటిని లెక్క చేయకుండా, కాంప్రవైజ్ కాకుండా భీకర యుద్ధం చేస్తున్నాయి.. ఇలా ఇవి యుద్ధానికి గనుక తలపడితే సుమారుగా ఒక గంటకు పైగా పోరాడుతాయట.. ఇవి చేసే పోరాటంలో అవి వాటి దవడలను లాక్ చేసి ప్రత్యర్ధిని ముప్పతిప్పలు పెడతాయట..

 

 

ఇకపోతే మనకు ఇప్పుడు కనిపించే వీడియోలో ఈ రెండు జంతువులు పోరాడుతున్న దృశ్యాలు భయంకరంగా కనిపిస్తాయి.. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, అదేమంటే పగ తమ తోటివారిని నాశనం చేయడానికి ప్రణాళికలు రచిస్తే, ద్వేషం మనిషికి మనుగడే లేకుండా చేస్తుంది.. అది మనుషులైన, జంతువులైన, మరే ఇతర జీవులకైన ఒక్కటే.. ఇక ఈ హిప్పోస్ యుద్దాన్ని మీరు చూసి ఎంజాయ్ చేయండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: