ఈ లోకంలో ప్రేమ చాలా విలువైనది. అది వెలకట్టలేనిది.చాలా అమూల్యమైనది.కాని రాను రాను ఈ ప్రేమ అనేది చాలా నీచంగా తయారైంది. చాలా మంది వావి వరసలు లేకుండా ప్రేమించుకుంటున్నారు.ఒక యువతి అయితే అయితే ఏకంగా తన సోదరుడునే ప్రేమించింది.ఇప్పుడు అతడితోనే డేటింగ్ చేస్తుంది. చివరికి పెళ్లికి కూడా సిద్ధమవుతోంది. అయితే వారు సొంత అన్నా చెల్లెల్లు కాదు.ఒకే తల్లికి పుట్టినవారు కాదు. కానీ, వారి తల్లిదండ్రులు ఒకరితో ఒకరు సహజీవనం చేశారు.


ఇక వివరాల్లోకి వెళితే..మాడ్డీ అని ఒక అమ్మాయి ఇటీవల ‘సీక్రెట్ క్రష్’ అనే డేటింగ్ షోలో పార్టీసీపెట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయాలు విని జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. మాడ్డీ తన సోదరుడైన కల్లాంతో ప్రేమలో పడింది. సోదరుడిని ప్రేమించడం తప్పు   కాదా అనే ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది.. ‘‘మా అమ్మ, కల్లం నాన్న చాలా ఏళ్లు ప్రేమలో ఉన్నారు. వారిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, చివరికి విడిపోయారు. వారిద్దరు విడిపోయినా కల్లాం, నేను.. సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉన్నాం’’ అని మాడ్డీ తెలిపింది.


ఇక మాడ్డీ ఇంకా మాట్లాడుతూ ‘‘కల్లాం చాలా మంచి యువకుడు. చాలా అందంగా కూడా ఉంటాడు. అతడు నాకు తొమ్మిదేళ్ల నుంచి తెలుసు. మీరంతా అతడు నాకు సోదరుడని భావిస్తున్నా, నేను మాత్రం అతడిని మాజీ సోదరుడని మాత్రమే అనుకుంటా. మా అమ్మ, అతడి నాన్న విడిపోయిన తర్వాత మేం మళ్లీ కలుసుకోలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా యోగక్షేమాలు తెలుసుకొనేవాళ్లం. అలా మా మధ్య చనువు పెరిగింది. కల్లాంపై ఉన్న కోరికలను చంపుకోలేకపోయాను. ఈ విషయం అతనికి చెప్పేశాను. అతడు ఎలా స్పందిస్తాడోనని ఎదురు చూస్తున్నా’’ అని తెలిపింది.


అయితే, మాడ్డీ ప్రేమ గురించి తెలుసుకుని కల్లాం ఆశ్చర్యపోయాడట. ఆమె మనసులో మాట చెప్పగానే అతడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందట. అంతేకాదు.. అతడు కూడా మాడ్డీ మీద ఉన్న ప్రేమని వ్యక్తం చేశాడు. ఆమెతో డేటింగ్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. మరి అన్నాచెల్లెళ్ల పెళ్లిలకు చట్టాలు ఒప్పుకుంటాయా అనే ప్రశ్నకు కల్లాం సమాధానమిస్తూ.. ‘‘మా నాన్న.. ఆమె తల్లి చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేదు. కాబట్టి.. మాది అన్నాచెల్లెళ్ల బంధం కాదు’’ అని అన్నాడు. మరి, వీరింత క్లారిటీతో ఉన్నప్పుడు ఎవరైన ఏం చెయ్యగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: