ఎంతో ఉత్కంఠంగా చాలా సీరియస్‌గా జరుగుతున్న ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో.. ఓ వ్యక్తి క్రీడాకారులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వడం జరిగింది. ఇక అతను ఉన్నపళంగా ఒక్కసారిగా ఆకాశంలో నుంచి భూమిపై పడ్డాడు. అవును మీరు విన్నది అక్షరాలా ముమ్మాటికీ నిజమే.. ఇక ఆకాశం నుంచి అమాంతం భూమిపైకి వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు అక్కడ సీరియస్ గా ఆడుతున్న ఫుట్‌బాల్‌ ప్లేయర్లు. ఇక దెయ్యంలా తెల్లబట్టలతో ఆకాశం నుంచి ఊడిపడిన ఆ గుర్తు తెలియని ఆ వ్యక్తి ఎవరో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకోండి.ఇక వివరాల్లోకి వెళితే పోలాండ్‌ దేశంలోని ఓ ప్రాంతంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. ఇక గోల్‌ కొట్టేందుకు ఇద్దరు టీమ్‌ ప్లేయర్లు, తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక కొంచెం సేపు అయితే గేమ్‌ ఫినిష్‌ అవుతుందనే టైమ్‌లోనే గాల్లో నుంచి ఓ వ్యక్తి కేకలు పెడుతూ ఆ స్టేడియంలోకి దిగబోయాడు.


ఇక దీంతో భయంగా ఒక్కసారిగా షాక్‌ అయిన ఆటగాళ్లు, భయంతో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ నుంచి పరుగులు తీశారు. ఇక దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి పారాచూట్‌తో విమానం నుంచి కిందకు దూకాడు. ఇక తను ఆకాశంలో విహరిస్తున్న సమయంలో పారాచూట్‌లో ఏదో సమస్య తలెత్తడంతో నేరుగా ఓ ఫుట్‌బాల్‌ మైదానంలోకి ల్యాండ్‌ అవ్వడం జరిగింది. కానీ ఆ వ్యక్తి సురక్షితంగానే భూమి మీదకు ల్యాండ్‌ అవడంతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. అయితే ఆ పారాచూట్‌తో దిగిన ఆ వ్యక్తికి ఫుట్‌బాట్‌ రిఫరీ ఎల్లో కార్డు చూపించడం అయితే మాత్రం మరింత ఫన్నీగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్స్‌.ఇక మీరు కూడా ఈ వీడియో చూసి మీ స్పందన ఏంటో తెలియజేయండి.





https://youtu.be/2bTrapS7P_c

మరింత సమాచారం తెలుసుకోండి: