డాక్టర్లు చేసే పని వైద్యం.. మనుషుల ప్రాణాలను మాత్రమే కాపాడుతుంది అనుకోవడం పొరపాటు.. కొత్త ఆలోచనలు చేస్తూ జనాలను అబ్భురపరుస్తున్నారు ఈనాటి డాక్టర్లు. విషయానికొస్తే ఓ డాక్టర్ ప్రజలకు మేలు చేయాలనీ అనుకున్నాడు. అది కూడా ఎవరూ ఊహించని విధంగా చేశారు. వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్న ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించి అద్భుతమైన ఇంటిని నిర్మించాడు.


అతని ఆలోచనను చక్కగా డిజైన్ చేసాడు ఓ ఆర్ట్ డైరెక్టర్.. వీరిద్దరి మరో సమాజ సేవకుడు కూడా తోడయ్యాడు. అనాధలకు ఒక ఇంటిని నిర్మించారు. అదికూడా కేవలం ప్లాస్టిక్ బాటిల్ తో కళ్ళు చెదిరే ఇంటిని నిర్మించారు. ఆ ఇంట్లో 60 మంది ఉండటానికి  వీలుగా ఉందని అంటున్నారు. ఆ ఇంటికి అవసరమైన పూర్తి వివరాలు విజయ్ కుమార్ అనే వ్యక్తి వివరించాడు. ఇందుకు వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ను , కూల్ డ్రింక్స్ ను వాడారు.


ఈ ఇంటి నిర్మాణాన్నికి మొత్తం 6 వేల వరకు ఉపయోగించామని చెప్పారు. కాగా వాటిని హైదరాబాద్ జిహెచ్ఎంసి సమకూర్చినట్టు తెలిపారు.ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్ల లో ఇసుక, మట్టిని నింపి వరుసగా పేరుస్తూ.. మధ్య లో సిమెంటు వాడినట్లు తెలిపారు. ఈ బాటిల్స్ ను హైదరాబాద్  జిహెచ్ఎంసి అందించినట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం 40 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పు విశాలమైన హాలు, గ్రంథాలయం మరియు వంట గదులు నిర్మించినట్లు తెలిపారు.ఇక 14 ఇంచుల మందంతో గోడలు నిర్మించినట్లు వివరించారు. మాములుగా ఇంత విశాలమైన ఇంటిని నిర్మించడానికి చాలా ఖర్చులు అవుతాయి. కానీ ఈ ఇంటిని నిర్మించినందుకు కేవలం 9 లక్షలు అయినట్లు వెల్లడించారు. వాతావరణానికి తగ్గట్లు వేడి, చల్లదనం ఉంటుందట. పర్యావరణాన్ని కాపాడటం లో ఈ ఆలోచన బాగుందని చాలా మంది మెచ్చుకున్నారు.  ఈ ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: