ఇప్పటివరకు భూమిమీద నిర్వహించిన ఒలంపిక్స్ మీరు చూసే ఉంటారు. ఒలంపిక్స్ లో ఎంతో మంది క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. కానీ అంతరిక్షంలో ఒలంపిక్స్ జరగడం ఎప్పుడైనా చూశారా.? అంతరిక్షంలో ఒలంపిక్స్ ఏంటండి అది సాధ్యమవుతుందా అని ఆశ్చర్యపోతారు ఇలా అడిగితే ఎవరైనా. కానీ ఇటీవలే అంతరిక్షం లో జరిగిన ఒలంపిక్స్ కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది. ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ఇటీవలే వ్యోమగాములు అంతరిక్షంలో ఒలంపిక్స్ గేమ్స్ ఆడారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో పలు పోటీలను సరదాగా నిర్వహించారు వ్యోమగాములు.
ఇక అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ లో వ్యోమగాములు ఆడిన ఆటలు చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు జిమ్నాస్టిక్ స్విమ్మింగ్ హ్యాండ్ బాల్ లాంటి ఆటలు ఆడేందుకు ఎంతగానో ప్రయత్నించారు వ్యోమగాములు. ఇలా ఆటలు ఆడేందుకు స్పేస్ స్టేషన్ లో వ్యోమగాములు పడుతున్న కష్టాలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్ థామస్ ఇక ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి