యువత ఈ సోషల్ మీడియా కు ఎందుకు ఇంత బానిస అవుతుంది అంటే.. ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా సందేశం పంపించాలి అన్నా.. పిడిఎఫ్ ఫైల్స్, ఫొటోస్, వీడియోలు, డాక్యుమెంట్స్ ఇలా ఏవైనా సరే అత్యంత వేగవంతంగా మరియు సులభ వంతంగా పంపించడానికి ఈ వాట్సాప్ లో ఉన్న ఫీచర్లు చాలా బాగా పని చేస్తాయి. అంతే కాదు మన హావభావాలను వ్యక్తపరిచే విధంగా కూడా ఈ వాట్సాప్ ప్రవేశపెట్టడం వల్ల వీటికి బాగా కనెక్ట్ అవుతున్నారు. గ్రూప్ వాయిస్ కాలింగ్, గ్రూప్ చాటింగ్, గ్రూపు వీడియో కాలింగ్ లాంటి సరికొత్త ఫీచర్లను వాట్సాప్ ప్రవేశపెట్టడం వల్ల ప్రతి ఒక్కరు ఎంత దూరంగా ఉన్నా సరే తమ వారిని చూసుకొని సంబరపడి పోయేలాగా ఈ వాట్సాప్ చేసింది.
గత కొన్ని నెలల నుంచి వాట్స్అప్ ద్వారా డబ్బులను కూడా బదిలీ చేసే వీలును ఏర్పాటు చేయడం వల్ల , ప్రతి ఒక్కరు ఇతర యాప్ లపై మొగ్గు చూపకుండా కేవలం వాట్సాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి , ఆసక్తి చూపిస్తున్నారు.. ఒక మనిషి కి ఇన్ని పనులు చేసిపెట్టే వాట్సాప్ ఒక్కసారిగా ఆగిపోతే అందరికీ ఊపిరాడనట్లయింది..ఇక ఎప్పుడెప్పుడు వాట్సాప్ పని చేస్తుందా అంటూ వాట్సాప్ సంస్థ అధికారులకు పెద్దఎత్తున ఇతర సోషల్ మీడియా యాప్ ల ద్వారా మెసేజ్ ల వర్షం కురిపించారు వాట్సాప్ యూజర్లు.. ఈ బానిసత్వం ఎంతవరకు వెళ్తుందో మనం వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి