భారతదేశం రక్షణ దళాల ప్రధాన అధిపతి అయినటువంటి.. బిపిన్ రావత్ తన కుటుంబంతో సహా ఇతర అధికారులతో కలిసి ఒక హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ ఉండగా.. తమిళనాడు దగ్గర కూనూర్ ప్రాంతంలో అనుకోకుండా హెలికాప్టర్ కూలిపోవడం జరిగింది. అందుకు కారణం దట్టమైన పొగమంచు ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. అయితే ఈ హెలికాప్టర్ కుప్పకూలడంతో కొన్ని అనుమానాలు అందరికి వ్యక్తమవుతున్నాయి. రక్షణ దళాల ప్రధాన అధినేత ప్రయాణిస్తున్నారంటే దానిని పూర్తి భద్రత తో చెక్ చేయవలసి ఉంటుంది.

అత్యంత భద్రతతో కూడినటువంటి ప్రయాణం తో చేయవలసి ఉంటుంది. బిపిన్ రావత్ ప్రయాణం చేసే అటువంటి హెలికాప్టర్ రష్యా కు చెందిన రుస్సి రకానికి చెందినది. దీని 9 సంవత్సరాల క్రితమే భారత వైమానిక దళంలో తీసుకున్నారు. రక్షణ రంగంలో ఉండేటువంటి హెలికాప్టర్లలో ఇదే ఎంతో సాంకేతికంగా అత్యున్నతమైన ది. హెలికాప్టర్ పైకి ఎగిరే సమయంలో 13 వేల కిలోల బరువును కూడా తీసుకు వెళ్ళగలరు. ఇక అంతే కాకుండా 32 పైగా సైనికులను,4500 కిలో బరువు గల సరుకులను కూడా తీసుకెళ్లి గలదు.

ఇందులో ముఖ్యంగా నావిగేషన్, ఎలక్ట్రానిక్ డిస్ ప్లే అంటే సదుపాయం కూడా కలదు. అందుచేతనే ఈ హెలికాప్టర్ ను లో చాలా అత్యున్నతమైనది గా పేర్కొన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హెలికాప్టర్ లోనే ఆయుధాలను కూడా యుద్ధ సమయంలో తీసుకొని పోయే వారు. ముఖ్యంగా మన దేశ సరిహద్దుల వద్ద హెలికాప్టర్ను పహారా గా కాయడానికి తీసుకువెళుతూ ఉంటారట. ఇక దీనిని రెండు సంవత్సరాల క్రితమే.. రష్యాకు చెందిన ఒక కంపెనీ వీటి మరమ్మతులను చేసే ఇచ్చింది. ఇలాంటివి మన దేశంలోనే ఇప్పటి వరకు 200 ఉన్నట్లు సమాచారం.

ఇక ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ వల్ల పేలకుండా పాలీ యురిత్రెనే ఉండడంవల్ల పేలకుండా ఉంటుందట. ఇక ఇందులో మిషన్ గన్స్, mkm గన్స్ వంటివి కూడా అమర్చి ఉంటాయట. ఇంతటి బందోబస్తుతో ఉన్న హెలికాప్టర్ ఇలా కుప్పకూలడం నిజంగానే దురదృష్టం అని చెప్పవచ్చు. కేవలం ఎలికాప్టర్ పనితీరు చేసుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడింది అన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: