ఇక ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అయిన డేవిడ్ వార్నర్(David Warner) తన మాజీ IPL జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై తుఫాన్ ఇన్నింగ్‌తో ఆకట్టుకున్నాడు.ఇక సెంచరీ చేసే అవకాశం వచ్చినా కానీ మరో ఎండ్‌లోని బ్యాటర్‌కు సూచనలిస్తూ ఎంకరేజ్ చేస్తూ బ్యాటింగ్ చేయండంలోనూ అతను కీలక పాత్ర పోషించాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీకి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ ఓనర్ కావ్యా పాపను కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తూ తెగ ఆడేసుకున్నారు. డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్‌లో గెలిచి ఇంకా ప్లే ఆఫ్ అవకాశాలను అలాగే ఉంచుకుంది. డేవిడ్ వార్నర్ కేవలం 58 బంతుల్లోనే అజేయంగా 92 పరుగులు చేసి,ఎంతగానో ఆకట్టుకున్నాడు.స్టేడియంలోని ప్రతి మూలకు కూడా బంతిని చితక కొడుతూ, హైదరాబాద్ బౌలర్లను బాగా చీల్చి చెండాడాడు. కాగా, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఆడిన ఓ ఢిపరెంట్ షాట్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 



ఈ అసాధారణ షాట్‌ను చూసి వ్యాఖ్యాతలతోపాటు ప్రేక్షకులు కూడా బాగా షాకయ్యారు. భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్ మొదటి బంతికి స్విచ్ హిట్ కొట్టాలని డేవిడ్ వార్నర్ నిర్ణయించుకున్నాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ డేవిడ్ వార్నర్‌ను గమనించి, అతని కాళ్లపై తెలివిగా బౌలింగ్ చేశాడు. దీంతో డేవిడ్ వార్నర్‌కు షాట్ ఆడేందుకు ఆస్కారం లేకుండా పోయింది.కానీ, ఈ మాజీ SRH కెప్టెన్ వార్నర్ కుడిచేతి వాటంగా తన స్టైల్‌ను మార్చుకుని, బాటమ్ హ్యాండ్ గ్రిప్‌ను ఉపయోగించి బంతిని ఫైన్-లెగ్ బౌండరీకి అతను తరలించాడు. దీంతో షాకైన ప్రత్యర్థి ఆ ఆటగాళ్లు.. ఇదేం షాట్ రా అయ్యా అంటూ వారి నోరెళ్లబెట్టారు. ఈ షాట్‌కు ఖచ్చితంగా ఓ పేరు పెట్టాలని వార్నర్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఈ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతోంది. ఇక వైరల్ అవుతున్న వార్నర్ షాట్ ని మీరు కూడా మరోసారి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: