నేటి రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం లో ఎక్కడో మారు మూల జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణకాల వ్యవధి లో తెలుసుకో గలుగుతున్నాము  అనే విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే సోషల్ మీడియాకు పాపులారిటీ పెరిగి పోయింది. దేశం లో ఎంతో మంది సోషల్ మీడియా  లో క్రేజ్ సంపాదించుకుని పాపులర్ కావడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత మంది చిత్ర విచిత్రం గా ప్రవర్తించి ఎంతో మంది దృష్టిని ఆకర్షించడం చూస్తూ ఉంటారు. కొంత మంది తమ లో దాగి ఉన్న టాలెంట్ నిరూపించుకుని సోషల్ మీడి యాలో ఎక్కువ లైకులు పొంది పాపులర్ కావాలి అని భావిస్తూ ఉంటారు.


 వెరసి సోషల్ మీడియా లో ప్రతి రోజు లక్షల వీడియోలు వైరల్ గా మారి పోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా తమ టాలెంట్ను నిరూపించుకోడానికి ఎంతో మంది వినూత్నమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్నిసార్లు మాత్రం బెడిసి కొట్టడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఎంతో మంది గాయాల బారిన పడుతుంటారు. ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందని చెప్పాలి. సైకిల్ స్టంట్స్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు.


 ఇటీవలే ఎంతోమంది ఎంతో సులభంగానే సైకిల్ స్టంట్స్ చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఓ యువకుడు సోషల్ మీడియా వేదికగా సైకిల్ పై స్టంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే ఒక కారు దగ్గరికి వెళ్లి ఏకంగా టర్న్  తీసుకోవాలని భావించాడు. అతని స్టంట్ కాస్త విఫలమైంది. దీంతో ఏకంగా అతను రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్పాలి. దీంతో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇది చూసి ఎంతో మంది అతనికి తిక్క కుదిరింది అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: