ఇక చైనా దేశంలో ఓ గొర్రెల మంద చాలా వింతగా ప్రవర్తిస్తూ అందరిని భయపెడుతుంది. రెండు వారాలుగా అవి గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాయి. రేయింబవళ్ళు అసలు అలసట అనేది లేకుండా తిరుగుతున్న వాటి తీరు ప్రపంచాన్నే భయపెడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అయితే ఈ గొర్రెలన్నీ కూడా ఇలా ఒకే విధంగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. చైనా సరిహద్దు దేశం మంగోలియాకు చెందిన మయో అనే వ్యక్తి వందల సంఖ్యలో గొర్రెలను పెంచుతున్నాడు. అందులో కొన్ని గొర్రెలు నవంబర్‌ నెల తొలి వారం నుంచి కూడా ఇలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఒక మందలోని గొర్రెలు అవి ఉన్నచోటే గుండ్రంగా తిరగడం ప్రారంభించాయి. మొదట కొన్ని గొర్రెలు ఇలా నడవడం మొదలుపెట్టాయి. ఇక మిగిలినవి వాటికి తోడయ్యాయి. అలా ఏకంగా 12 రోజులపాటు ఆ మందలోని గొర్రెలన్నీ కూడా ఇలా క్రమం తప్పకుండా గుండ్రంగా తిరుగుతూనే ఉండటం ఇప్పుడు చాలా ఆశ్చర్యం రేకెత్తిస్తోంది.దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్న వీడియో ఒకటి.. ఈ నెల మొదట్లో తెగ వైరల్ అయ్యింది. 


చైనా అధికారిక మీడియా కంపెనీ అయిన పీపుల్స్‌ డెయిలీ కూడా దీనిపై వార్తలను ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ వార్త అయితే చైనా ప్రజలను కలవరానికి గురిచేసింది. అలా తిరగడం అసలు మంచిది కాదని అది అపశకునమని.. మరో ప్రకృతి విపత్తుకు ఇది సంకేతంగా ఉందని అక్కడి ప్రజలు భయపడుతూ అనుమానం వ్యక్తంచేశారు. అయితే, ఈ సమయంలో నెటిజన్లు చైనా నుంచి మరో ముప్పు రాబోతోందంటూ సోషల్‌ మీడియాలో సరదాగా ట్రోల్ చేశారు.అయితే సైంటిఫిక్ గా తేలిన మరో విషయం ఏమిటంటే లిస్టెరియోసిస్‌ బాక్టీరియా సోకడం వల్ల ఇలా గొర్రెల మంద చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉండవచ్చని పశువైద్య నిపుణులు తెలుపుతున్నారు. అర్ధమయ్యేలా చెప్పాలంటే దీనిని సర్క్లింగ్‌ వ్యాధి అని కూడా పిలుస్తారు.మెదడులో ఓవైపు దెబ్బతినడంతో అవి ఇలా వింతగా ప్రవర్తించేందుకు దారితీస్తాయి. ఈ వ్యాధి సోకిన జంతువులు 48 గంటల్లోనే మరణించే ప్రమాదం ఉందని పశు వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: