సోషల్ మీడియా అందరికీ అందుబాటులో వచ్చిన నేపథంలో ప్రతిరోజు లక్షల వీడియోలు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇలా తిరమీదికి వచ్చిన కొన్ని వీడియోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఏకంగా కొంతమంది వ్యక్తులు ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి చేసే విచిత్రమైన పనులు అయితే అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా అబ్బాయిలు ఇక అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక లవ్ లో ఉన్న తర్వాత ఎప్పుడు అమ్మాయి తనను చూసి వావ్ అనాలి అనుకుంటారు అబ్బాయిలు.


 ఇలాంటి పిచ్చి ఆలోచనతో కొన్ని కొన్ని సార్లు విచిత్రమైన పనులు చేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ముఖ్యంగా బైక్ ద్వారా విన్యాసాలు చేయడం లాంటివి కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు బైక్ ద్వారా విన్యాసాలు చేస్తూ లవర్ ముందు పోస్ కొట్టాలి అనుకుంటే మాత్రం చివరికి బొక్క బోర్లా పడిపోయి పరువు పోగొట్టుకోవడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా వీడియోనే వైరల్ గా మారిపోయింది. ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా తన ప్రియురాలని బైక్ వెనకాల సీట్ లో ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే బైక్ రైడింగ్ లో తన గొప్పతనం ఏంటో చూపించాలి అని భావించాడు. ఇక ఎంతో స్టైల్ గా బైక్ను నడపడం మొదలు పెట్టాడు. కానీ అంతలోనే అతని ప్లాన్ కాస్త రివర్స్ అయింది. ఇక ఇలా అతను స్టైల్ గా బైక్ నడుపుతున్న సమయంలో చోటు చేసుకున్న ఘటన చూసి ప్రతి ఒక్కరు అయ్యో పాపం అని అంటూ ఉన్నారు. ఎందుకంటే బైక్ స్కిడ్ అయి పడిపోవడంతో ఇక ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు అని చెప్పాలి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: