ఇక్కడ ఒక ఉన్నతాధికారి తనిఖీలు చేయడానికి వచ్చిన సమయంలో చివరికి ఒక పోలీస్ అధికారి కాస్త దొరికిపోయాడు. కనీసం ఆ పోలీస్ అధికారికి తుపాకీలో బుల్లెట్ ఎలా లోడ్ చేయాలో కూడా తెలియకపోవడంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. ఇక తనిఖీకి వచ్చిన ఉన్నతాధికారి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ఒక పోలీస్ స్టేషన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది తనిఖీలు చేయడానికి వచ్చిన ఒక ఉన్నతాధికారి అక్కడ ఉన్న సిబ్బంది పనితీరును పరీక్షించటం కోసం కొన్ని పరీక్షలు పెట్టాడు. తుపాకిని లోడ్ చేయగలవా అని ఒక పోలీస్ అధికారిని ప్రశ్నించాడు ఉన్నతాధికారి.
ఉన్నతాధికారి అలా అడగడంతో ఎందుకు చేయలేను సార్ తప్పకుండా చేస్తాను అంటూ సమాధానం చెప్పాడు పోలీస్. దీంతో ఇక తన ముందుకు వచ్చి తుపాకీ లోడ్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు ఉన్నతాధికారి. దీంతో సదరు సబ్ ఇన్స్పెక్టర్ ఇక తుపాకీని ఎలా లోడ్ చేయాలో తెలియక ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యాడు. ఏకంగా ఫిరంగి మాదిరిగా బుల్లెట్ తుపాకీ ముందు భాగం నుంచి పెట్టడంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వు ఆపుకోలేక పోయారు అని చెప్పాలి. అంతేకాదు సదరు ఇన్స్పెక్టర్ పరిస్థితిని చూసిన ఉన్నతాధికారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చివరికి తుపాకీ ని ఎలా లోడ్ చేయాలి అన్న విషయాన్ని వివరించాడు. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో నేటిజన్స్ కూడా నవ్వుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి