ఇప్పుడు ఇలాంటి ఒక భయానక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కొంతమంది వ్యక్తులు కలిసి బోట్లో సరదాగా ఫిషింగ్ చేయడానికి వెళ్లారు. కానీ వారికి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా ఒక పెద్ద షార్క్ చాప వారిపై దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా వారు ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అయింది. ఈ వీడియో చూసి నేటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇక ఈ షాకింగ్ ఘటన జరిగింది అని చెప్పాలి.
ఇక ఈ వీడియోలో చూసుకుంటే కొంతమంది వ్యక్తులు ఇక చేపల వేటలో భాగంగా సరదాగా బోటులో ఫిషింగ్ కి వెళ్ళారు. ఈ క్రమంలోని ఈవేటలో ఒక మత్స్యకారుడు చేతులను శుభ్రం చేసుకునేందుకు కాస్త పడవలోంచి వంగి ఇక అక్కడే ఉన్న నీటితో శుభ్రం చేసుకుంటాడు. ఇలా చేతులు శుభ్రం చేసుకుంటున్న సమయంలో అక్కడికి దూసుకు వచ్చిన ఒక సొర చేప అతని చేతులపై దారుణంగా దాడి చేసింది. అంతేకాదు అతని పడవలో నుంచి నీళ్లలోకి లాగేసింది. దీంతో భయపడిపోయిన మిగతా వ్యక్తులు అతన్ని నీళ్లలోంచి వెంటనే పడవలోకి లాగారు. వీడియో కాస్త భయానకంగానే ఉంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి