సాధారణంగా నేటి రోజుల్లో చాలామంది కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు నదులు, సరస్సుల దగ్గరికి వెళ్లి సరదాగా చేపలు పట్టడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా చేపలు పట్టడానికి వెళ్ళిన సమయంలో కొన్ని కొన్ని సార్లు జనాలకు అనూహ్యమైన  చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఏకంగా చేపలు పట్టడానికి వెళ్తే వాళ్లకు ఇంకేదో చిక్కడం ఇక అలా వలకు చిక్కిన జీవి ప్రమాదకరమైనది కావడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి.



 అయితే ఇలాంటి ఘటన ఎక్కడైనా జరిగింది అంటే చాలు అది వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్లో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఒక వ్యక్తి కాస్త ఖాళీ సమయం దొరకడంతో దగ్గరలో ఉన్న ఒక నదికి వెళ్ళాడు  ఇక అక్కడ సరదాగా చేపలు పట్టడం ప్రారంభించాడు. అయితే ఇంతలో అతని వలకు ఒక చేప చెక్కింది. దీంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కానీ అంతలోనే ఊహించని చేదు అనుభవం ఎదురయింది. నది వద్ద తాపీగా కూర్చుని అతను నీటిలోకి గాళం వేయగా కొద్దిసేపు వేచి చూసిన వెంటనే గాలానికి ఒక చేప చిక్కింది.



 అయితే గాలానికి చిక్కిన చేపను బయటకు తీసేందుకు ప్రయత్నించాడు సదరు వ్యక్తి. దీంతో ఆ నదిలో నీటిలో ఓ నల్లటి ఆకారం తన వైపుగా వస్తున్నట్లు కనిపించింది. దీంతో అతనికి ఒక్కసారిగా భయమేసింది. అయితే తీరా ఆ నల్లటి ఆకారం నది ఒడ్డు వరకు వచ్చేసింది. దీంతో ఏంటా అని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యాడు. ఎందుకంటే అది ఒక భారీ సైజు మొసలి. ఇంకేముంది ఆ మొసలిని చూడగానే అతని వెన్నులో వణుకు పుట్టింది. అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. అయితే గాలానికి చిక్కిన చేప కోసం ఆ మొసలి అతని వెంట పరుగులు పెట్టడం వైరల్ గా మారిపోయిన వీడియోలో చూడవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: