
పదవ తరగతిలో తమకుమారుడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడం చేత తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని లైట్ గా తీసుకోవడమే కాకుండా ఏకంగా కేక్ కట్ చేసి మరి వేడుకలు చేసి మరి తమ కుమారుడికి ధైర్యాన్ని చెప్పారు. ఈ సంఘటన బాగల్కోటె జిల్లా నవనగరకు చెందింది. అభిషేక్ అనే విద్యార్థి పదవ తరగతిలో అన్ని సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయ్యారు దీంతో అన్ని సబ్జెక్టులలో 200 మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో చాలామంది విద్యార్థులు అభిషేను హేళన చేస్తూ ఉన్నారట.
అయితే తన కుమారుడు పరిస్థితిని గమనించిన తల్లితండ్రులు ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆలోచించకుండా ఒక కేక్ తెప్పించి మరి కట్ చేసి వేడుకను చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు మరొకసారి రాయొచ్చని ఫెయిల్ అయినంత మాత్రాన ఎలాంటి ఆందోళన పడవలసిన అవసరం లేదంటే తన కుమారుడికి గట్టి ధైర్యం చెప్పారు ఈ తల్లితండ్రులు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మారుతున్నాయి. సాధారణంగా పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులను తల్లిదండ్రులు చాలా సందర్భాలలో తిడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. కానీ అభిషేక్ తల్లితండ్రులు మాత్రం తన కుమారుడును మరింత ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాలి అనేటట్టుగా చేశారు. అయితే ఈ విషయం విన్న పలువురు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తే.. విద్యార్థులు సూసైడ్ బారి నుంచి తప్పించుకోగలరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.