ఉద్యోగ జీవితంలో విజయవంతంగా రాణించడం అనేది నదిపై ప్రయాణం లాంటిది కాదు. మహా సముద్రంపై ప్రయాణం లాంటిది. స్వల్ప కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాం. తక్షణ పదోన్నతి కోసం ఆరాటపడతాం. దీర్ఘకాలిక అవసరాలను, ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోం. కానీ, చిన్న చిన్న విషయాలే కెరీర్‌పై ఎనలేని ప్రభావం చూపుతాయి.