జ్ఞాపకశక్తి అనేది మనిషి జీవన శైలిలో ప్రధానమైన అంశం అనే చెప్పాలి. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరగడం సహజం. అలాంటిది ఇప్పుడున్న కాలంలో చిన్న పిల్లల సైతం మతిమరుపు సమస్య ఎదుర్కొంటున్నారు. ఒక వ్యక్తి తన నిత్య జీవితంలో జరిగే పనులను పూర్తి చేయడానికి జ్ఞాపక శక్తి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. వృత్తిరీత్యా , విద్య పరంగానూ, నిత్య జీవితంలోనూ ఇలా అన్ని చోట్లా జ్ఞాపకశక్తి అనేది ముడిపడి ఉంటుంది. మనిషి మతిమరుపు కారణంగా కొన్నిసార్లు తమ జీవితంలో విలువైన వాటిని కూడా కోల్పోతుంటారు.