కరోనావైరస్ విజృంభణ కారణంగా ప్రపంచ దేశాలలో మానవాళికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇటువంటి ఎన్నో రకాల వైరస్ లు ఏదో ఒక రూపంలో మన చుట్టూ ఉంటాయి. మనము వాటిని కొన్నిసార్లు పీల్చుకుంటూ ఉంటాము కూడా. అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాని చాలా సార్లు, మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ కారణంగా ఆ వైరస్ లను ఎదుర్కొని మనల్ని రక్షిస్తుంది.