మనకు ప్రాణం ఉన్నప్పుడే అది జీవితం అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ప్రాణాన్ని నిలబెట్టే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరం. మనం ఇప్పుడు కంటికి కనిపించని కరోనా అనే శత్రువుతో పోరాడుతున్నాం. అందులోనూ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఓ వైపు ఈ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు, ప్రభుత్వాలు మరియు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.