కుటుంబం మనకు జీవితాన్ని అందిస్తుంది. పద్ధతులు, నడవడిక మనకు మన తల్లితండ్రులు నేర్పుతారు. ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, మాట్లాడే పద్ధతి, గుణగుణాలు మన కుటుంబ సభ్యుల నుండి అలాగే మన చుట్టూ ఉండే పరిసరాల నుండి నేర్చుకుంటాము. చదువు సంధ్యలు, క్రమశిక్షణ గురువుల వద్ద నేర్చుకుంటాం. అలవాట్లు అనేవి మన స్నేహితులను చూసి నేర్చుకుంటాము మరియు అలవరుచుకుంటాము.