జీవితం అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఎన్నో విషయాల సమ్మిళితం. ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ఉంటాము. ప్రతి మనిషి వారి జీవితంలో నిరంతర విద్యార్ధే అన్నది అక్షర సత్యం. మనిషి జీవితంలో ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి ఎంతో కొంత మిగిలే ఉంటుంది. నేర్చుకోవడం అంటే కేవలం చదువుకు సంబంధించినవి మాత్రమే కాదు.