`వెబ్` జ‌ర్న‌లిజంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పోర్ట‌ల్ ప్రోత్స‌హించ‌ని విధంగా ఇండియా హెరాల్డ్ వెబ్ పోర్ట‌ల్‌.. త‌న సంస్థ‌లో ప‌నిచేసే ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టుల‌ను, ఆథ‌ర్స్‌ను ప్రోత్స‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా ఏ పోర్ట‌ల్‌కు అయినా వార్త‌లే ప్ర‌ధానం. ఒక పోర్ట‌ల్ ఉన్న‌త స్థానానికి ఎదిగేందుకు.. రీడ‌బిలిటీ రేంజ్ పెంచుకునేందుకు.. రేటింగ్‌లో దూసుకుపోయేందుకు ఆయా పోర్ట‌ల్స్ లో పోస్ట్ అయ్యే.. క‌థ‌నాలు, వార్త‌లే కీల‌కం. ఒక పోర్ట‌ల్‌లో అన్ని వార్త‌లు బాగా ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, ఒక వార్త బాగా హైలెట్ అయి.. పోర్ట‌ల్‌కు మంచి పేరు తీసుకురావొచ్చు.
ఆ ఒక్క‌వార్త‌ను రాసిన వారిని ప్రోత్స‌హించ‌డం.. మ‌రింత నాణ్య‌మైన రీతిలో వార్త‌లు రాసేలా వెన్నుద‌న్నుగా ఉండ‌డం అనేది ఒక్క ఇండియా హెరాల్డ్ పోర్ట‌ల్‌లో మాత్ర‌మే మ‌న‌కు క‌నిపిస్తుంది. ఇత‌ర ఏ పోర్ట‌ల్స్‌లోనూ క‌నిపించ‌దు. ఒక వేళ ప్రోత్స‌హించినా.. మ‌హా అయితే.. రూ.100 కు మించి ఇవ్వ‌డం లేదు. కానీ, ఇండియా హెరాల్డ్ ఈవిష‌యంలో అనుస‌రించే విధాన‌మే డిఫ‌రెంట్‌. ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టులు ఎక్క‌డెక్క‌డో ఉంటారు. ఏ పోర్ట‌ల్ అయినా వారితో ప‌ని చేయించుకోవ‌డం వ‌ర‌కే.. ఆ త‌ర్వాత వారు ఎవ్వ‌రో అన్న‌ట్టుగానే ఉంటుంది.
కానీ హెరాల్డ్ తీరు ఇంద‌కు భిన్నం. హెరాల్డ్ చైర్మ‌న్ కోటిరెడ్డి ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టుల‌ను కూడా త‌మ కుటుంబంలో ఓ భాగంగా గుర్తించి టాలెంట్‌ను గౌర‌విస్తారు. బెస్ట్ ఆర్టికల్‌గా ఎంపికై.. పోర్ట‌ల్‌కు మంచి పేరు తీసుకువ‌చ్చిన ఆథ‌ర్‌కు ఆ ఒక్క ఆర్టిక‌ల్‌కు సంబంధించి రూ.1116 నుంచి రూ. 5116 వ‌ర‌కు ఇచ్చి ప్రోత్స‌హిస్తుంటారు. అదేవిధంగా వారిని ప్రోత్స‌హించేందుకు నిత్యం పోటీ త‌త్వాన్ని పెంచేందుకు ప్ర‌య‌త్నించారు.
అయితే.. క‌రోనా నేప‌థ్యంలో నిత్యంబెస్ట్ ఆర్టిక‌ల్ అవార్డుల‌ను కొంత వాయిదా వేసినా.. క‌రోనా ప‌రిస్థితి కుదురుకున్నాక‌.. మాత్రం ఖ‌చ్చితంగా అవార్డుల‌నుపునః ప్రారంభించ‌డం ఖాయం. ఏదేమైనా.. వెబ్ జ‌ర్న‌లిజంలో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇండియా హెరాల్డ్‌.. అదే పంథాలో న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: