
పదో తరగతి మాత్రమే కాదు డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లు కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటారు. కానీ ఈయన పదో తరగతి చదువుతోనే ఆపేసి కంప్యూటర్లో జావా ప్రోగ్రాం నేర్చుకొని మెల్లిమెల్లిగా టేక్ దిగ్గజంగా ఎదిగారు. అలా 750 రూపాయల నెల జీతానికి పనిచేసిన సరిపెల్లి కోటిరెడ్డి గారు ప్రస్తుతం ఎన్నో సంస్థలను స్థాపించి దాదాపు 769 కోట్ల టర్నోవర్ ని సాధించారు అంటే పనిమీద ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. కోటి రెడ్డి గారు ఎన్నో సంస్థలను స్థాపించి కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు.ఈయన పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి.. అలా కోటి రెడ్డి గారు 230 దేశాల్లో తన సంస్థలను విస్తరించడమే కాదు మన భారతదేశంలో కూడా ఎన్నో సంస్థలను స్థాపించారు.
అలా పినాకిల్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టం, భారత్ హెల్త్ కేర్ ల్యాబ్స్, నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్, ఇండియా హెరాల్డ్ మీడియా, ఇంటర్నేషనల్ క్వాలిటీ మేజర్స్, పిల్బే, శ్రీ ధరణి, భారత్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, బ్లడ్ వంటి ఎన్నో టెక్ కంపెనీలతోపాటు కోటి ఫౌండేషన్, సేవా ఫౌండేషన్ వంటి సంస్థలు స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అలా ఓవైపు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.. అలాంటి కోటిరెడ్డి సార్ కి 769 కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఆయన ఆశయం.. అలాంటి ఒక గొప్ప ఆశయంతో ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన సరిపెల్లి కోటిరెడ్డి గారిది ఈరోజు అనగా జూన్ 23న పుట్టినరోజు కావడంతో ఇండియా హెరాల్డ్ కోటిరెడ్డి సార్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.