కానీ, నార్మల్ డెలివరీలో ఉండే నొప్పి తట్టుకోవడం కంటే డబ్బులు ఖర్చు పెట్టడమే మంచిది అనే ఉద్దేశంతో చాలా మంది ఆలోచిస్తున్నారు. నార్మల్ డెలివరీ లో కూడా నొప్పిని తగ్గించే ఇంజెక్షన్స్ ఉంటాయి.కానీ నార్మల్ డెలివరీ వైపు ఎవరు మొగ్గు చూపడం లేదు. అలాగే రెండోది జాతకాల మీద నమ్మకం. ఆపరేషన్ అనుకోండి మంచి, చెడు చూపించుకుని బిడ్డను కనవచ్చు అనే ఒక గుడ్డి నమ్మకంతో ఆపరేషన్ మీద మొగ్గు చూపుతున్నారు. ఒక్కోసారి చాలా ఏళ్ళ తర్వాత గర్భం ధరించినా.. సహజ ప్రసవం ప్రమాదకరం కాకపోయినా, సిజేరియన్లోలా బిడ్డని పువ్వులా బయటికి తీయడమైతే జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లకి ఇష్టం లేకపోయినా కుటుంబసభ్యులు అడగడంతో సిజేరియన్ చేయడానికి అంగీకరిస్తున్నారు.
నార్మల్ డెలివరీలో బిడ్డ జననం ఎవరి చేతిలోనూ లేదు. అది సరైన టైం కాకపోతే బిడ్డ భవిష్యత్ బావుండదేమో అన్న భయం, బెంగ. అదే సిజేరియన్ డెలివరీ అయితే అనుకూలమైన సమయంలో డెలివరీ జరుగుతుంది. బిడ్డ జాతకం బావుంటుంది అనే భరోసా.కానీ ఆపరేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో ఆ మహిళకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక గంట నొప్పి భరించలేక ఆపరేషన్ చేయించుకుంటున్నారు. కానీ తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి.వీలయితే సహజ ప్రసవం మంచిది.. !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి