
అలాగే కొంత మందికి త్వరగా తగ్గిపోవాలన్న ఆతృత ఉంటుంది. దాంతో ఒకేసారి ఎక్కువ డైటింగ్ చేసేస్తుంటారు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఏదైనా గాని కొంచెంగా మొదలుపెట్టి పెంచుకుంటూ పోవాలి. ఒక్కసారిగా ఆహారపు అలవాట్లు మార్చేస్తే నీరసం వచ్చేస్తుంది. లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. డైటింగ్ అంటే మరీ కడుపు మాడ్చేసుకోనక్కర్లేదు. బలవర్ధకమైన ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడమే డైటింగ్.మనం తినే ఆహారంలో ఘనాహారాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ద్రవాహారాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. అలాగే కొన్ని రకాల ఫ్యాట్స్ ఆరోగ్యానికి మంచిది. వాటిని చెడు చేసే ఫ్యాట్స్ అనుకుని పొరబడి తినకుండా ఉండకండి. ఏది తినాలో ఏది తినకూడదో ముందు క్లారిటీ తెచ్చుకోండి. ఒక్కసారిగా ఏమి తినకుండా డైటింగ్ చేస్తే మన శరీరం ఆ మార్పును తట్టుకోలేదు. అందుకనే కొంచెం కొంచెం తింటూ మన శరీరాన్ని మనమే అలవాటు చేసుకోవాలి కొన్నిసార్లు ఎంత డైటింగ్ చేసినా బరువు తగ్గరు. అలాంటప్పుడు డైట్ ప్లాన్ చేంజ్ చేసుకోవాలి తప్ప వాటినే తింటూ ఉండిపోకూడదు.
ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉంటే ప్లాన్ చేంజ్ చేయాలా లేదా అన్నది తెలుస్తుంది. కొందరైతే ఆహారం తగ్గించేసి ప్రొటీన్ షేకులూ, విటమిన్ ట్యాబ్లెట్లూ వేసేసుకుంటూ ఉంటారు. ఆ పొరపాటు ఎప్పుడూ చేయవద్దు. ఆహారాన్ని ఏదీ రీప్లేస్ చేయలేదన్న విషయాన్ని మర్చిపోకండి.
అలాగే చాలామంది చేసే తప్పేంటంటే...డైటింగ్ చేసిన అన్ని రోజులు చేస్తారు.. తరువాత వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏదన్నా కనపడితే వెంటనే తినేస్తారు. ఇలాంటప్పుడు ఎక్కువ చెడు జరుగుతుంది. తినకూడదు అనుకున్నవాటి జోలికి అస్సలు వెళ్లకండి. లేదంటే డైట్ కంట్రోల్ చేసి ఉపయోగం ఉండదు.