పాలక్ కోఫ్తాకర్రీ
కావాలసిన పధార్థాలు : బచ్చలకూర లేదా పాలకూర : 4 కట్టల
ఉల్లిపాయలు : నాలుగు
బంగాళదుంపలు : 6
బ్రెడ్ : 5 స్లైసులు
పాలు : 1 ¼ కప్పు
అల్లం : 1 అంగుళం ముక్క
గరంమసాలా : చెంచా
నూనె : 1 చెంచా
డాల్డా : గరిటెలు
కారం : 1 చెంచా
ఉప్పు , పసుపు : సరిపడ
తయారీ విధానం :
బంగాళదుంపలను ఉడికించి తోలు తీసి మెత్తగా చేసుకొని ఉంచాలి. దీనికి నీటిలో ముంచి తీసి పిండిన బ్రెడ్ ముక్కలు, ఉల్లి, మిర్చి, ముక్కలు, కొత్తిమీర, గరంమసాలా, ఉప్పు, మామిడికాయ పొడి, బచ్చలికూర కొంచెం వేసి కలిపి ముద్ద చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో డీష్ ఫ్రై చేసుకుని కోఫ్తాలను ప్రక్కన ఉంచాలి.
గ్రీవీకీ ఉల్లిపాయలు, బచ్చలి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీలో కొంచెం నూనె వేసి కాగిన తర్వాత బచ్చలికూరని వేసి దానికి కొంచెం పంచదార కలిపి ఉడికించాలి. పంచదార వల్ల కూర రంగు మారదు.
ఉడికిన తర్వాత ఫేస్టులా చేసుకోవాలి. బాండీలో 2 గరిటెల నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిముక్కలు అల్లం మెత్తగా నూరినది వేసి వేపి దాంట్లో బచ్చలి ఫేస్టును, పాలు, ఉప్పు, మామిడికాయ పొడి, గరంమసాలా, పసుపు, కారం వేసి గట్టిపడేంతవరకు ఉడికించాలి దించే ముందు కోఫ్తాలను కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: