నల్లసుగంధపాలవేర్లు, ముదురు, ముదురు వేపచెట్టుబెరడు, బలాచెట్టు వేర్లు, వరిపేలాలు, సముద్రపు ఉప్పు నీటిని ఒక్కొక్కటి 100 గ్రా చొప్పున తీసుకుని మెత్తగా నలగకొట్టి పాత్రలోవేసి అందులో నాలుగు కేజీల మంచినీరు కలిపి చిన్నమంటపైన రెండుకేజీలు కషాయం మిగిలేవరకు మరిగించాలి. పాత్రను దించి వడపోసి ఆ కషాయంలో అరకేజి ప్రశస్తమైన కల్తీలేని నువ్వుల నూనె, పావు కేజీ దేశవాలి గేదెనెయ్యి కలిపి చిన్నమంటమీద పదార్థాలన్నీ ఇగిరిపోయి చిక్కటి తైలం మిగిలేవరకు మరిగించి దించి వడపోసుకోవాలి. ఈ తైలాన్ని రెండుపూటలా ఆరుచుక్కల మోతాదుగా ముక్కలలో వేసుకొని పీలుస్తుంటే స్త్రీ చర్మపు ముడతలు, తెల్లవెంట్రుకలు మాయమయిపోయి నల్లని వంట్రుకలతో నవనవలాడే నవ్య సౌందర్యం సంప్రాప్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: