వినాయకుణ్ని పూజించటానికి తిథి, నక్షత్రము, ఉపవాస విధులేమి లేవు. తెల్ల జిల్లేడు వేరు తెచ్చి, దానితో బొటన వ్రేలి కణుపు పరిమాణముతో పద్మానమునున్న గణపతిని చేయాలి. ఆ గణపతిని నాలుగు భుజములు, మూడు కన్నులు గల వానిగానూ, ఆభరణాలతోనూ, సర్ప యజ్ఞోపవీతము ధరించినట్టుగా చేయవలెను, శిఖరమున చంద్రరేఖ ధరింప చేయాలి.
ఎడమ చేతిలో దంతము, కుడిచేతిలో జపమాల, మూడవ చేతిలో గొడ్డలి, నాల్గవ చేతిలో లడ్డూ ఉంచాలి. కుంకుమ చందనములతో, వస్త్రభూషణములతో, ఎర్రని పుష్ఫములతో పూజించి సుగంథ ధూపమూ, ఉండ్రాళ్లు సమర్పించాలి. పొట్టి అతిధికి ముందుగా భోజనము పెట్టాలి. అలా పూజించిన వారికి గణేశుని సిద్ది అపారంగా కలుగుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: