ఇక ఇండియన్ ఫేమస్ టూ వీలర్ కంపెనీ అయిన హీరో మోటోకార్ప్ మెక్సికో దేశంలో తమ వాహనాల రిటైల్ అమ్మకాలను ప్రారంభించినట్లు ప్రకటించడం జరిగింది.అక్కడి మార్కెట్లో వివిధ కస్టమర్ గ్రూప్స్ అవసరాలకు అనుగుణంగా మోటార్‌సైకిళ్లు ఇంకా స్కూటర్‌లతో సహా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మెక్సికోలో ప్రవేశపెట్టినట్లు కంపెనీ ఓ మీడియా ప్రకటనా ద్వారా తెలిపడం జరిగింది.ఇక మెక్సికో మార్కెట్లో హీరో మోటోకార్ప్ అందించబోతున్న ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టి, హంక్ 190 ఇంకా హంక్ 160ఆర్, హంక్ 150 అలాగే ఎకో 150 టిఆర్ ఇంకా ఎకో 150 కార్గో వంటి పాపులర్ మోటార్‌సైకిళ్లు ఇంకా ఇగ్నైటర్ 125, డాష్ 125 వంటి ప్రముఖ స్కూటర్లు ఉన్నాయని కంపెనీ వివరించడం జరిగింది.ఇక హీరో మోటోకార్ప్ తమ గ్లోబల్ సేల్స్ మార్కెట్‌ను బాగా విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా, మెక్సికో దేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక అలాగే అక్కడి మార్కెట్లో అన్ని టూ వీలర్ వాహనాలను తక్కువ ధరలకు విడుదల చేసినట్లు కంపెనీ తెలిపడం జరిగింది. 

ఇంకా డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీలు అలాగే విక్రేతల నెట్‌వర్క్ ద్వారా మెక్సికోలో హీరో మోటోకార్ప్ తన విక్రయ వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది.మెక్సికోలో హీరో మోటోకార్ప్‌కు ఇక ఎలాంటి డీలర్లు లేరు. అయితే, నెట్‌వర్క్ కారణంగా చాలా తక్కువ ఖర్చుతోనే ఆ దేశంలో తమ టూ వీలర్ వాహనాలను ప్రారంభించగలిగామని కంపెనీ తెలిపడం జరిగింది.ఇక అంతే కాకుండా, మెక్సికన్లను బాగా ఆకర్షించేందుకు ప్రత్యేక రుణ పథకాలను కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపడం జరిగింది.ఇక ఇందులో భాగంగానే మెక్సికోలని పలు ఆర్థిక కంపెనీలతో కలిసి హీరో మోటోకార్ప్ వివిధ రకాల ప్రత్యేకమైన ఆఫర్లను ప్రవేశపెట్టడం జరిగింది. మెక్సికోలో హీరో మోటోకార్ప్ బైక్స్ ని మూడు సంవత్సరాలు లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీతో అందించడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: