ఇండియాలో బాగా ఫేమస్ అయినా టూ వీలర్ బ్రాండ్ అయిన honda Motor cycle india భారతీయ మార్కెట్లో కొత్త CB200X బైక్ విడుదల చేయడం జరిగింది. ఇండియా మార్కెట్లో విడుదలై కొత్త honda CB200X బైక్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 1.44 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఇండియా).ఇక ఈ కొత్త బైక్ బుకింగ్స్ ఇప్పుడు ప్రారంభించబడ్డాయి. అలాగే ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్ లేదా ఆఫీషియల్ డీలర్ షిప్ ద్వారా 2,000 రూపాయల టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చునట.కొత్త CB200X బైక్ హార్నెట్ 2.0 ఆధారంగా ఇది డిజైన్ చెయ్యబడింది. ఇది ఇండియా మార్కెట్లో కంపెనీలో అత్యంత చౌకైన అడ్వెంచర్ బైక్‌గా మారనుంది.ఇక ఈ కొత్త బైక్ చాలా స్టైలిష్ లుక్ ని కూడా కలిగి ఉంది. ఇంకా అనేక అధునాతన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

 ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.హోండా కంపెనీ ప్రస్తుతం CB500X బైక్ ని ఇండియన్ మార్కెట్లో అడ్వెంచర్ లైనప్‌లో అమ్ముతుంది.కాబట్టి ఇప్పుడు ఇండియా మార్కెట్లో విడుదలైన కొత్త CB200X దాని తరువాతి స్థానంలో ఉంచబడుతుంది. ఇక ఈ కొత్త CB200X బైక్ కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌కు బదులుగా సాధారణ రెడ్‌వింగ్ డీలర్‌షిప్ నుండి అమ్మబోతుంది.ఇక హోండా CB200X బైక్ డిజైన్ విషయానికి వస్తే.. ఈ బైక్ కి ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఇంకా ఇండికేటర్స్ ఉన్నాయి. అయితే ఇందులోని విండ్‌స్క్రీన్ మాత్రం సాధారణంగా అడ్వెంచర్ బైక్‌లలో కనిపించే దానికంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది గాలి విస్ఫోటనం నుంచి కాపాడుతుంది.ఇక ఈ బైక్ లో సీటు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ సీటు మాత్రం విడిగా ఉంచబడింది. అలాగే వెనుక ఉన్నవారికి కూడా తగినంత సౌకర్యాన్ని అందించడానికి ఇందులో గ్రాబ్ రైల్ అనేది ఇవ్వబడింది. ఇక మొత్తానికి ఈ బైక్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: