క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తున్న మోదీ సర్కార్... మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మోతేరాను నిర్మించిన కేంద్రం... ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్ క్లేవ్ ప్రాంగణంలోనే దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం మొత్తం 584 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది. మొత్తం 80 వేల చదరపు మీటర్ల విస్తర్ణంలో దీనిని నిర్మించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తిస్థాయి నిధులను కూడా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భరించనుంది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉత్తమమైన శిక్షణతో పాటు వసతి సదుపాయం కూడా కల్పించనున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఇలాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడం ఎంతో మేలు జరుగుతుందంటున్నారు క్రీడా పండితులు.


మరింత సమాచారం తెలుసుకోండి: