ఏపీ సీఎం జగన్‌కు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టు జైలు శిక్ష జరిమానా విధించింది. ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో టిటిడి ఈవో ధర్మారెడ్డి కి హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను అమలుచేయలేదని కోర్ట్ ధిదిక్కరణ పిటీషన్ దాఖలు చేయగా.. హైకోర్టు విచారణ జరిపింది.


ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని తెలిసిపిన హైకోర్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఒక నెల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 2000 జరిమానా వేసింది. అయితే.. ఈ శిక్షలపై పైకోర్టులో పిటిషన్ వేసుకునేందుకు హైకోర్టు ఛాన్స్ ఇచ్చింది. ఇక ధర్మారెడ్డి విషయానికి వస్తే.. ఆయన సీఎం జగన్‌కు ఇష్టమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ సీఎం అయ్యాక.. ఆయన్ను కావాలనే.. ఈ పదవిలో నియమించారని చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: