రాజధాని పై జగన్మోహన్ రెడ్డి నిన్న విశాఖ లో చేసిన వ్యాఖ్యలపై కోర్టు ధిక్కారణగా పరిగణించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై కోర్టు ఉల్లంఘన కేసు వేయొచ్చు కదా అని చంద్రబాబుని కొందరు న్యాయవాదులు అడిగిన తర్వాత ఆ దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అమరావతి అంశంపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు సైకో తనమేనన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఒకసారి జైలుకు పోయి వచ్చాడు కాబట్టి లెక్కలేని తనంతో ఎన్ని ఉల్లంఘనలైనా చేస్తాడని అంటున్నారు.


సుప్రీంకోర్టు లో కేసు ఉండగా ఆ అంశంపై మాట్లాడటం తప్పేనన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కోర్టు ధిక్కరణ కేసు కు వెల్దామనుకున్నాం కానీ ప్రధాన హియరింగ్ కూడా దగ్గరలోనే ఉందిగా? అని గుర్తు చేశారు. ఎన్ని కేసులు వేసినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఆపడని అయినా.. కోర్టు ధిక్కరణ కేసు పరిశీలిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: