వైద్యరంగంలో నే  రాబడి

ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు అనువైన అవకాశాలు ఉన్నాయని కన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండ్రస్టీ  (సిఐఐ) భావిస్తోంది.  ముఖ్యంగా  వైద్య రంగంలోనే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు  సిఐఐ  తెలిపింది.  కోవిడ్-19 తో ప్రపంచం దిక్కుతోచని స్థితిలోకి చేరుకున్న వేళ ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం తీసుకున్న చర్యలు పారిశ్రామిక  ప్రగతి పునరుజ్జీవనానికి ఎంతో దోహదం చేశాయని ఆ సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ   ప్రతినిథి  సి కె. రంగనాథన్  స్పష్టం చేశారు.
ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు  ఉన్నందున ఆ  దిశగా పెట్టుబడులు పెట్టెందుకు  సి.ఐ.ఐ  ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పెట్టుబడులను తక్కువ కాలం లోనే రెట్టీంపు చేసుకోవచ్చని అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా తన వంతు తోడ్పాటు ఇవ్వాలని ఆయన అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వానికి తాము పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ఒక టాాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసే అలోచనలో సిఐఐ ఉందని చెప్పారు. దీని వల్ల పారిశ్రానిక రంగం ఎదుర్కోంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లే అవకాశం ఉంటుందని  రంగనాథ్ అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఆదిశగా సి.ఐ.ఐ కొంత కసరత్తు చేస్తోందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా  ఇప్పుడు అందిస్తున్న సహకారానికి తో పాటు మరింత సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రభుత్వం ముందుకు వస్తే సి.ఐ.ఐ తన వంతు  పనులను పూర్తి చేస్తుందని అన్నారు.


ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం  లైట్ హౌస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సి.ఐ.ఐ. నిర్ణయించినట్లు రంగనాథన్ ప్రకటించారు.  పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలను కునే వారికి  లైట్ హౌస్ ఉపయుక్తం కాగలదని ఆయన పేర్కోన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక పురోగతికి చేపడుతున్న చర్యలు అమోఘంగా ఉన్నాయని రంగనాథన్ కితాబిచ్చారు. పారిశ్రానిక రంగానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం   కోవిడ్ సమయంలో రాయితీ బకాయిలను విడుదల చేసిందని,  రీస్టార్ట్ ప్యాకేజీలు అందించిందని రంగనాథన్ పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: