ప్రతిరోజూ పడుకునే ముందు పెదాలను బీట్రూట్ రసాన్ని రాయాలి. ఎర్ర గులాబీ రేకుల్ని పేస్టులా చేసి పెదాలకు రాస్తే సున్నీతంగా ఉంటాయి. ఎండినట్లుండే పెదాలకు ముందుగా ఆవిరిపట్టి వేజలైన్, తేనే కలిపిన మిశ్రమాన్ని పూయాలి. ఇలా కనీసం వారానికి మూడుసార్లు చేస్తే పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. తాజా వెన్న రాసినా మంచిదే ఆహారంలో విటమిన్ బి, సి లు ఎక్కవగా తీసుకుంటూ మెంథాల్ వున్న లిప్ బామ్ను బ్రష్తో రాస్తే పగిలిన పెదాల స్థానంలో మెరిసే, మృదువైనపెదాలు మీ సొంతమవుతాయి. ‘‘నీ నవ్వే చాలు చామంతీ..... పూబంతీ....’’ అంటూ ఎవరైనా పాడినా పాడగలరు జాగ్రత్త..! ఎర్రని ఎరుపు వాడితే చౌకబారుగా ఉంటుందని కొందరు భయపడుతుంటారు.... కానీ అది నిజం కాదు. ఎరుపు ఎప్పడూ అందంగానే ఉంటుంది. ఒకవేళ అది వాడ్డానికి సిగ్గుగా ఉంటే కొద్దిగా చాకొలెట్ రంగు మిళితమైన ఎరుపును ఎంచుకోండి. అయితే మీ మేనిఛాయను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు మరీ తెల్లగా ఉంటే నీలిఛాయ ఉన్న ఎరుపు బాగుంటుంది. నల్లగా ఉంటే గోధుమఛాయ ఉన్న ఎరుపు వాడవచ్చు ఛామన ఛాయలో ఉన్నవారికి ఏ ఎరుపులోనైనా బాగానే ఉంటుంది. పెదాలు సన్నగా మరీ సన్నగా వుంటే... మిశ్రమరంగుల్ని వేయండి లిప్ స్టిక్ను ఎపుడూ లిప్ బ్రష్తోనో చూపుడు వేలితోనే మాత్రమే వేయండి. వేసిన రంగును తుడిచి మళ్లీ వేరే రంగు వేసేముందు పసుపు రంగు ఐ షాడో లిప్ స్టిక్ వేసేముందు లిప్ బామ్ ఆప్లై చేయిండి. లేదంటే వేజలైన్ అయినా సరే.. లిప్ స్టిక్ వేయడం పూర్తయిన తరువాత చివరిగా కొద్దిగా లిప్ గ్లాస్ వేస్తే మీ అధరాలు నిజంగానే అదరహో !  

మరింత సమాచారం తెలుసుకోండి: