సాధార‌ణంగా వయసులో ఉన్న వారిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ముఖంపై వచ్చే మొటిమలు కూడా ఒకటి. మొటిమలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. మొటిమలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అసలు కారణం చాలా సాధారణంగా ఉంటుంది. వెంట్రుక కుదుళ్లలలో ఉండే తైల గ్రంధులు విస్తరించినప్పుడు అదనపు సిబం మరియు మృత చర్మకణాలు అడ్డుపడినప్పుడు మొటిమ అభివృద్ధి జరుగుతుంది. అయితే వీటిని త‌గ్గించుకోవ‌డానికి అనేక కెమిక‌ల్ ప్రోడెక్ట్స్ వాడుతుంటారు. దీంతో అనేక సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. 

 

అయితే మ‌నం వాడే వైట్‌ టూత్ పేస్ట్‌తో మొటిమ‌ల స‌మ‌స్య‌కు ఈజీగా చెక్ పెట్ట‌వ‌చ్చు. అవును! మనం రోజు ఉదయాన వాడే టూత్‌పేస్ట్‌ దంతాలను మెరిసేలా మాత్రమేకాదు.. ఇతర లాభాలను కూడా చేకురుస్తుంది. ముఖ్యంగా టూత్ పేస్ట్‌ మొటిమలను తగ్గిస్తుంది. అందుకు ముందుగా నైట్ ఫేస్ ని నీట్ గా కడుక్కుని వైట్ టూత్ పేస్ట్ ను మొటిమలపై అప్లై చేసి అలాగే ఉంచాలి. ఇలా చేయటం వల్ల‌ మొటిమలు, వాటి వ‌ల్ల వ‌చ్చే వాపులుతగ్గుతాయి. తెల్లటి టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్‌ తక్కువగా ఉంటుంది. అందువల్ల చర్మానికి ఎటువంటి హానీ కలగదు.

 

అలాగే  ఒక గిన్నెలోకి కొద్దిగా టూత్‌పేస్ట్‌ తీసుకోవాలి. అందులో తేనె వేసి మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి కాసేపు వదిలేయాలి. పావుగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే.. మొటిమల సమస్యే త‌గ్గింస్తుంది. అదేవిధంగా, ఒక గిన్నెలోకి కొద్దిగా టూత్‌పేస్ట్‌, ఉప్పు తీసుకుని మిక్స్ చేయండి. ఇప్పుడు ముఖానికి ఆవిరిపట్టంచి.. ముందుకు మిక్స్ చేసుకున్న మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేయండి.  పావుగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: