చాలా మంది జుట్టు సంరక్షణలో ఎన్నో రకాల జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ఎండాకాలంలో మరీ ఎక్కువగా జుట్టు పొడిబారి పోయి, నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా కుదుళ్ల నుంచి నూనెలు ఎక్కువగా విడుదలవడం మానేస్తాయి. అలాంటప్పుడు మనం ఎన్నో జాగ్రత్తలు వహించాలి. ఒక వేళ జాగ్రత్త వహించకపోయినట్లయితే చుండ్రు సమస్యలు, జుట్టు చిట్లిపోవడం, విరిగిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా తలస్నానం చేసిన తర్వాత, చివరగా ఒక లీటర్ నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి, జుట్టును తడిసేలాగా పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మీద పోసి కనీసం రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి, చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు నిగనిగలాడుతూ, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది..
ఇక అరకప్పు తేనె తీసుకుని, జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సమానంగా పట్టించి, జుట్టును ముడివేసి, చుట్టలాగా చుట్టి, హెయిర్ క్యాప్ పెట్టేయాలి. అర గంటసేపు తరువాత షాంపుతో లేదా షీకాయతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు మెరుస్తూ, గాలికి అలలాగా ఎగిరి పడతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండడమే కాకుండా నిగనిగలాడుతూ ప్రకాశవంతంగా ఉంటుంది.
తేనె, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ కేశాలను ఆరోగ్యంగా ఉంచి, మెరిసేటట్లు చేస్తుంది. అందుకోసం పావు కప్పు ఆలివ్ ఆయిల్ తీసుకొని, అందులో పావు కప్పు తేనె కలిపి, తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇది డీప్ కండీషనర్ గా పని చేయడమే కాకుండా జుట్టుకు పోషణ ను అందిస్తుంది. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఆకర్షణీయంగా కనబడుతుంది..
అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకొని, అందులో కొద్దిగా పుదీనా రసం కలిపి, ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా కలిపి జుట్టుకు బాగా పట్టించి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు చల్లదనం అందడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి