కొందరి స్కిన్ అయితే ఎప్పుడూ కూడా చాలా జిడ్డుగా ఉంటుంది. ఇలాంటి వారు మార్కెట్లో దొరికే ఖరీదైన ఆయిలీ ఫ్రీ ఫేస్ వాష్ లను కొనుగోలు చేసి వాటిని తెగ వాడుతుంటారు.అయితే మనం ఎంత ఖరీదైన ఫేస్ వాష్ లేదా ఫేస్ క్రీంను వాడినప్పటికీ కూడా కొద్ది నిమిషాలకే మళ్లీ చర్మం జిడ్డు జిడ్డుగా మారుతుంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ వాష్ ను మాత్రం వాడితే అధిక జిడ్డు చాలా ఈజీగా తొలగిపోయి మీ ముఖం క్షణాల్లో ఫ్రెష్ గా ఇంకా అలాగే గ్లోయింగ్ గా మారుతుంది. ఇక ఆ హోమ్ మేడ్ ఫేస్ వాష్ ఏంటి? దానిని ఎలా తయారు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఆలస్యం చేయకుండా  తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి ఇంకా ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసుకోవాలి. అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని వాటిని బాగా మిక్స్ చేయాలి. అంతే న్యాచురల్ ఫేస్ వాష్ రెడీ అయిపోతుంది.


ఇంకా ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని వేళ్ళతో బాగా సాఫ్ట్ గా రబ్ చేసుకోవాలి.అలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు చర్మాన్ని రబ్ చేసుకుని ఆ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ని వాడటం వల్ల చర్మంపై పేరుకుపోయిన  జిడ్డు చాలా సులభంగా తొలగిపోతుంది. మీ ముఖ చర్మం క్షణాల్లో తాజాగా ఇంకా కాంతివంతంగా మారుతుంది. అలాగే చర్మం ఎక్కువ సమయం పాటు ఆయిలీగా మారకుండా కూడా ఉంటుంది.ఇంకా అంతేకాదు ఈ హోమ్ మేడ్ ఫేస్ వాష్ ను వాడటం వల్ల చర్మం పై పేరుకుపోయిన మురికి ఇంకా మృత కణాలు చాలా సులభంగా తొలగిపోతాయి. ట్యాన్ సమస్య కూడా ఈజీగా దూరం అవుతుంది. ఇక జిడ్డు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన న్యాచురల్ ఫేస్ వాష్ ను వాడి చూడండి. మీ చర్మం ఫ్రెష్ గా ఇంకా గ్లోయింగ్ గా మెరిసిపోయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: