జుట్టుకు సంబంధించిన చాలా రకాల ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం, బలహీనంగా మారిపోవడం ఇంకా జుట్టులో ఎదుగుదల నశించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ముఖ్య కారణం సరైన పోషకాహారం లేకపోవడం. అయితే ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో కల్తీ, జంక్ ఫుడ్ వంటివే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో జుట్టుకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందడం లేదు. అందువల్ల జుట్టు నిర్జీవంగా, బలహీనంగా తయారై రాలడం వంటివి జరుగుతున్నాయి. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కలబంద అనేది చక్కగా పని చేస్తుంది. ఈ కలబందలో ఉండే ఔషధ గుణాలు ఇంకా పోషకాలు కురులకు కావాల్సిన పోషణను అందిస్తాయి. కల బందతో కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.మన జుట్టు పొడవుగా పెరగాలన్నా.. ఒత్తుగా అవ్వాలన్న కలబంద చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా దువ్వెనతో దువ్వు కోవాలి.ఇక ఆ తర్వాత కలబంద గుజ్జును తీసుకుని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. బాగా మర్దనా చేసుకోవాలి. ఇక ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి.


ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బాగా గట్టి పడి జుట్టు రాలిపోకుండా ఉండడమే కాకుండా పొడుగ్గా ఇంకా ఒత్తుగా కూడా పెరుగుతుంది.అలాగే ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల కలబంద గుజ్జును తీసుకోవాలి. తరువాత ఇందులో రెండు స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని వేసుకుని బాగా కలుపు కోవాలి. ఇక ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లై చేసుకోవాలి. ఒక గంట తర్వాత షాంపూతో శుభ్రంగా హెడ్ బాత్ చేయవచ్చు. ఇలా చేస్తే జుట్టు మెత్తగా ఇంకా పట్టుకుచ్చులాగా ఉంటుంది.ఇక ఒక గిన్నెలోకి ఐదు స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని గోరు వెచ్చగా అయ్యేంత దాకా వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడి అయిన నూనెలో మూడు స్పూన్ల కలబంద గుజ్జును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా బాగా పట్టించాలి. ఇలా రాత్రంతా ఉంచుకుని పొద్దున్నే షాంపూతో తల స్నానం చేయవచ్చు. ఇక ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: