గతంలో ప్రముఖ నటుడు విక్రాంత్ మాస్సే కి ఇచ్చిన పాత్రని ఇప్పుడు రాఘవ్ జయల్ కనిపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. రామాయణం చిత్రంలో రాఘవ్ పాత్ర మేఘనాథ్ పాత్రను కొంతమేరకు పోలి ఉంటుందనే విధంగా వినిపిస్తున్నాయి. అంటే రావణ్ పాత్రలో కనిపిస్తున్న యష్ కుమారుడి పాత్ర అన్నట్లుగా సమాచారం. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించబోతున్నారు. మరి యంగ్ హీరో రాఘవ్ రామాయణం చిత్రంలో చేరితే ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజీ వస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.
రాఘవ్ జయల్ వెబ్ సిరీస్ లు, సినిమాలతో తనని తాను నిరూపించుకుంటూ బాలీవుడ్ లోనే భారీ క్రేజ్ అందుకున్నారు. రాఘవ్ మొదట పలు చిత్రాలలో సైడ్ డాన్సర్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఇప్పుడు పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం తన చేతిలో రామాయణం, ఏబిసిడి 3 అలాంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సీజన్ 2 లో నటించబోతున్నారు. అలాగే ఈ ఏడాది రామాయణం సినిమా కూడా నవంబర్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసింది సుమారుగా రూ .1400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రామాయణం సినిమా రెండు భాగాలుగా రాబోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి