ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఏప్రిల్ 29వ తేదీన ఎంతో మంది ప్రముఖుల జననాలు  జరిగాయి. మరొక్కసారి హిస్టరీ లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.. 

 

 రాజా రవివర్మ జననం : ప్రముఖ భారతీయ చిత్రకారుడు రామాయణ మహాభారతంలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన గొప్ప చిత్రకారుడు అయిన రాజా రవివర్మ 1848 ఏప్రిల్ 29వ తేదీన జన్మించారు. భారతీయ సాంప్రదాయిక పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలుగా  మిగిలిపోయాయి. చీర కట్టుకున్న స్త్రీలను అందంగా చక్కని ఒంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి అని చెబుతూ ఉంటారు. 1873లో జరిగిన చిత్ర కలా  ప్రదర్శనలో మొదటి బహుమతి గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. భారత చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవివర్మ 58 సంవత్సరాల వయస్సులో  మధుమేహంతో మరణించాడు.

 

 

 బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జననం : ప్రముఖ పండితుడు సంఘసంస్కర్త రచయిత ఆయన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి 1876 వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన జన్మించారు.ఈయన రచించిన రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి. ఇక అందుకుగాను ఎన్నో అవార్డులు రివార్డులు సైతం అందుకున్నారు ఈయన.

 

 

 ఆవుల గోపాల కృష్ణ జననం : ప్రసిద్ధిచెందిన హేతువాది అయిన ఆవుల గోపాలకృష్ణ 1917 ఏప్రిల్ 29వ తేదీన జన్మించారు. సూత పురాణం లోని పద్యాలు అన్నింటిని కంఠస్థం చేసాడు  ఆవుల గోపాలకృష్ణ. రాడికల్ హ్యూమనిస్టు సమీక్ష పత్రికలు నడిపించాడు ఆవుల గోపాలకృష్ణ, 1964లో అమెరికా ప్రభుత్వం ఈయన్ను  ఆహ్వానించింది  వివేకానంద పైన చేసిన విమర్శల దృష్ట్యా అమెరికా వెళ్లవద్దని  ఆంధ్రప్రభ ఆందోళన వ్యక్తం చేసింది. 1942లో రాడికల్ అనే పత్రికను స్థాపించి పార్టీ పత్రిక నడిపారు. సమకాలీన సిద్ధాంతాల్ని వెంటనే అర్థం చేసుకుని అనేక రకాల గురించి తెలుగులో విడమరచి చెప్పగల వ్యక్తి  గోపాల కృష్ణ కృష్ణ మూర్తి.

 

 ఆశిష్ నెహ్రా జననం  : ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు ఆయన ఆశీష్ నెహ్రా   1979 ఏప్రిల్ 29వ తేదీన జన్మించారు. ఇండియన్ క్రికెట్ లో కీలక ఆటగాడిగా ఎన్నో సంవత్సరాలపాటు సేవలందించాడు ఆశిష్ నెహ్రా. ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అనంతరం కామెంటేటర్గా అవతారమెత్తాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతున్న ఆశీష్ నెహ్రా   తనదైన కామెంట్రీ తో  ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: