ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోలకి పోటీ ఇచ్చే అందం, ఫిజిక్ నాగార్జున సొంతం. సాధారణంగా సీనియర్ హీరోలు యంగ్ గా కనిపించేందుకు మేకప్ వేసుకొని ఎన్నో కష్టాలు పడుతుంటారు. అదే సమయంలో ముసలి పాత్రలకి వాళ్ళకి గెటప్, మేకప్ అవసరం ఉండదు. కానీ నాగార్జునని ముసలి క్యారెక్టర్లో చూపించాలంటే ఎంతో కష్టం. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో కోసం నాగార్జున అటు కుర్రాడిగా, ఇట ముసలి వ్యక్తిగా, మధ్యవయసు వ్యక్తిగా మూడు పాత్రల్లో కనిపించారు. కుర్రాడిగా, మధ్యవయసు వ్యక్తిగా కనిపించడానికి నాగార్జున ఇబ్బంది పడలేదట. ఓల్డ్ మేన్ గెటప్ కి మాత్రం నాగ్ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.