రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో ఉంది. దేశ సగటుకంటే రాష్ట్ర సగటు తక్కువగా ఉందనే లెక్క ఒక్కటే రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే విషయం. అయితే రాష్ట్రంలో మరణాల్లో మాత్రం చిత్తూరు జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పటి వరకూ చిత్తూరు జిల్లాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 415. సోమవారం ఒక్కరోజే చిత్తూరులో 9మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 415కి చేరుకుంది.