అదిగో, ఇదిగో అనుకుంటున్న నయనతార పెళ్లి పుకార్లకు ఫుల్ స్టాప్ పడే రోజు వచ్చేసిందని అంటున్నారు సినీ అభిమానులు. పెళ్లి చేసుకోడానికే నయనతార, విఘ్నేష్ జంట చెన్నైనుంచి కొచ్చికి చేరుకుంటుందని అంటున్నారు. దక్షిణాది స్టార్ ప్రేమ జంట నయనతార, విఘ్నేష్ శివన్ కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని ఓ ప్రైవేట్ జెట్ విమానంలో చెన్నైనుంచి కొచ్చికి వచ్చారు.