ఇడుపులపాయలో జరగనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయ వెళ్లనున్నారు. సాయంత్రం 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. రేపు ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పిస్తారు.