కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాపై ఇప్పటికే అమెరికా సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనా కరోనా వ్యాక్సిన్ పరిశోధనల సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నట్టు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సైబర్ సెక్యురిటీ నిపుణులు ఆరోపణలు చేశారు. చైనా హ్యాకర్లు వ్యాక్సిన్ పరిశోధనల డేటాను తస్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. 
 
కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అమెరికాలోని పలు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా హ్యాకింగ్ పై వార్నింగ్ ఇవ్వడానికి ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెరికాలో జరిగిన కరోనా పరీక్షలు, చికిత్సకు సంబంధించిన వివరాలను కూడా చైనా తస్కరించడానికి ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ అమెరికా ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: